ఫారెన్ సిగ‌రేట్స్ సేల్స్ ముఠా అరెస్ట్

ఫారెన్ సిగ‌రేట్స్ సేల్స్ ముఠా అరెస్ట్

హైద‌రాబాద్: ఫారెన్ సిగరేట్స్ ను అక్రమంగా తరలించి, సేల్స్ చేస్తున్న ముఠాను శుక్ర‌వారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విష‌యం పై హైదరాబాద్ సీపీ అంజనికుమార్ మాట్లాడుతూ.. ఫారెన్ సిగరేట్స్ అక్రమంగా రవాణా, సేల్స్ చేస్తున్న రాకెట్ ను పట్టుకున్నామ‌న్నారు. 503 ఫారెన్ సిగరేట్ కార్టెన్స్ సీజ్ చేశామ‌ని, ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ తరహా రాకేట్ ముంబైలో జరుగుతుందని…ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. టాక్స్, జీఎస్టీ, ఎగ్గొట్టి ఈ గ్యాంగ్ ఫారెన్ సిగరెట్లు అక్రమంగా రవాణా చేస్తూ సేల్స్ చేస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న దుకాణాలకు, పాన్ డబ్బాల ద్వారా ఈ ముఠా ఫారెన్ సిగరేట్ సేల్స్ చేస్తున్నారని చెప్పారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితుడు విపుల్ రాంక్ పై బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయన్నారు. సిద్ది అంబర్ బజార్ లో సర్ణ ట్రాన్స్ పోర్ట్ కేంద్రంగా ఈ అక్రమ దందా నడుస్తోందని..ఈ ముఠాలో విపుల్ రంకకి రోల్ ప్లే చేస్తున్నాడని తెలిపారు. విపూల్ రాంకపై గతంలో బేగంబజార్ లో కేసులు నమోదయ్యాయ‌ని చెప్పారు. దాదాపు 12 కంపెనీలకు చెందిన విదేశీ అక్రమ సిగరెట్లు నగరంలో విక్రయిస్తున్నారన్నారు. ఈ సిగరెట్లు ఆయా పాన్ షాప్స్ లో లభించేలా ఈ ముఠా అప్రేషన్ చేస్తోందన్నారు. ఈ ముఠాలో రవీందర్ సింగ్ సర్న ట్రాన్స్ పోర్ట్ కీలకంగా వ్యవహరించిన నిందితుడు పరారీలో ఉన్నాడ‌న్నారు. ఈ ముఠా నుంచి రూ. కోటి 3లక్షల విలువ చేసే 503 ఫారెన్ సిగరేట్ ను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు సీపీ.