ప్రైవేట్ యూనివర్సిటీల జోవోకు వ్యతిరేకంగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు PDSU విద్యార్థి సంఘం నేతలు. ప్రైవేట్ వర్సిటీల బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసేందుకే ప్రైవేట్ వర్సిటీల బిల్లును తెస్తుందని మండిపడ్డారు.
