హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టూడెంట్లలో సృజనాత్మకతను వెలికి తీయడానికి కళలు ఎంతగానో ఉపయోగపడుతాయని, స్కూళ్లలో చదువుతోపాటు కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్కూల్ఎడ్యుకేషన్డైరెక్టర్నర్సింహారెడ్డి చెప్పారు. శుక్రవారం మాదాపూర్‌లోని సీసీఆర్టీలో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవాలు–2024 ఘనంగా జరిగాయి. నర్సింహారెడ్డి పాల్గొని వివిధ కళల్లో విజేతలకు అవార్డులు అందజేశారు.
రాష్ట్రంలోని జిల్లాల నుంచి 174 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వోకల్మ్యూజిక్ లోభద్రాచలంలోని భద్రాచలం పబ్లిక్ స్కూల్ కు చెందిన పి.చక్రిక అండ్టీమ్, డ్యాన్స్‌లో హనుమకొండలోని సెయింట్ పీటర్స్హైస్కూల్ కు చెందిన ఎ.యజ్ఞశ్రీ, విజువల్ఆర్ట్స్ లో మంచిర్యాల ఆల్ఫోర్స్జూనియర్ కాలేజీకి చెందిన ఎం.శ్రీవాత్సవ్ ఫస్ట్ ప్రైజ్ పొందారు. వీరంతా జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.