న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి సోషల్ బుక్‌లో ఎన్సీఈఆర్టీ ప్రచురించిన ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ చాప్టర్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించిన అధ్యాయంపై సోషల్ మీడియా వేదికగా బేషరతుగా క్షమాపణలు చెప్పింది ఎన్సీఈఆర్టీ. ఈ పుస్తకాన్ని ఇప్పటికే ఉప సంహరించుకున్నామని.. మార్కెట్లో కూడా అందుబాటులో లేదని తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. విద్య విషయంలో ఖచ్చితత్వం, సున్నితత్వం, బాధ్యతతో కూడిన అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి ఎన్సీఈఆర్టీ కట్టుబడి ఉందని తెలిపింది.
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ బుక్‌లోని ఓ అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చాప్టర్ న్యాయ వ్యవస్థ సమగ్రతను కలుషితం చేస్తుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అలా జరగడాన్ని దేశంలో ఎవరూ అనుమతించబోరని స్పష్టం చేశారు. ఏ సంస్థనైనా, వ్యక్తినైనా కించపర్చడాన్ని న్యాయ వ్యవస్థ సహించదని హెచ్చరించారు.
ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ బుక్‌పై నిషేధం విధించారు. ఈ అంశం తీవ్ర వివాదస్పదం కావడంతో ఎన్‌సిఇఆర్‌టి ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నిషేధిత 8వ తరగతి పాఠ్యపుస్తకాల కాపీలు ఎవరి దగ్గరైనా ఉంటే వాటిని కౌన్సిల్ ప్రధాన కార్యాలయానికి తిరిగి ఇవ్వాలని ఎన్‌సిఇఆర్‌టి ఒక అడ్వైజరీ జారీ చేసింది.
𝐏𝐫𝐞𝐬𝐬 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞: 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐀𝐩𝐨𝐥𝐨𝐠𝐲
— NCERT (@ncert) March 10, 2026
The National Council of Educational Research and Training [NCERT] has recently published a social science textbook, “Exploring Society: India and Beyond," Grade 8 (Part II), which contained Chapter IV titled “The Role of… pic.twitter.com/mZY15aJTDo
