ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్

ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా(Aha itt) మరో కొత్త వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అదే "అర్థమైందా అరుణ్ కుమార్(Arthamainda Arun Kumar)". అరుణ్ కుమార్ అనే వ్యక్తి జీవితం, ఆఫీసులో లో అతను ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘అర్థమైందా అరుణ్ కుమార్’  వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు మేకర్స్.  కార్పొరేట్ ఉద్యోగులు, వారు ప‌డే బాధ‌లు, వారి క‌ల‌ల‌ను సాధించే క్ర‌మంలో ఎదుర‌య్యే ఇబ్బందులు, సాధించే విజ‌యాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో చూపిస్తున్నారు. 

ఈ మేరకు జూన్ 7 బుధవారం రోజున పోస్టర్‌ క్కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్న ఈ సిరీస్ లో.. హ‌ర్షిత్ రెడ్డి(Harshith reddy), అనన్య శ‌ర్మ‌(Ananya sharma), తేజ‌స్వి మ‌దివాడ(Tejaswi Madivada) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.