బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీ సీఎంకు సీబీఐ నోటీసులు..

బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీ సీఎంకు సీబీఐ నోటీసులు..

లిక్కర్ స్కాంలో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.  ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. ఇప్పటికే ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. పలువురిని ఈడీ విచారించింది. 

మార్చిలో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది సీబీఐ. మనీష్ సిసోడియా చార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటంలో ఇప్పుడు ఆయన్ను విచారించాలని నిర్ణయించింది సీబీఐ. మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ ఆదివారం ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.

ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంపై ఇటీవలే జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. అందులో ఏకే.. అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాన భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించాడు. ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాట్ చేసినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సైతం జైలు నుంచే.. తన లాయర్ ద్వారా బయటకు విడుదల చేశాడు. 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కాంలో నోటీసులు జారీ చేయటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. సీఎం స్థాయి వ్యక్తిని.. 100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో పాత లిక్కర్ పాలసీనే అమలవుతుంది.. మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ.. ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలు అన్నింటి క్రమంలోనే కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయటం.. 16వ తేదీ విచారణ రావాలని.. 14వ తేదీ సమన్లు పంపించటం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.