
పది రూపాయలు దొరికితే అదృష్టం అనుకుంటాం.. అదే 10 వేల రూపాయలు దొరికితే ఎగిరి గంతేస్తాం.. అలాంటిది అక్షరాల లక్ష డాలర్లు.. ఆకాశం వర్షంలా కురిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకోవటానికి ఆశ్చర్యంగా.. ఆనందంగా ఉంది కదా.. ఇలాంటివి అరుదైన ఘటనను నిజం చేసి చూపించాడు చెక్ రిపబ్లిక్ టీవీ ప్రజెంటర్ కమిల్ బర్తోషేక్. తాను స్వయంగా యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంటారు.. తన ఫాలోవర్స్ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించాడు.. అందరికీ బహుమతి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు కమిల్.. ఇందులో భాగంగానే హెలికాఫ్టర్ నుంచి డబ్బులు వర్షంలా కురిపించాలని ఐడియా వేశాడు.. అందుకు తగ్గట్టుగానే.. తన ఫాలోవర్స్ అందరికీ మెయిల్స్ చేశాడు.. ఫలానా చోటుకు రండి.. మీ అందరికీ గిఫ్ట్ ఇస్తానంటూ చెప్పాడు.. అనుకున్నట్లుగానే అందరూ ఆ ప్రాంతానికి వచ్చారు.. ఆ తర్వాత డబ్బులు వర్షంలా కురిశాయి.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌ఫ్లుయెన్సర్, టెలివిజన్ హోస్ట్ కమిల్ బార్టోషేక్, లైసా నాడ్ లాబెమ్ సమీపంలో హెలికాప్టర్ నుంచి ఒక మిలియన్ డాలర్ల మొత్తాన్ని విసిరి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదటగా అతను ఒక పోటీ నిర్వహించి.. అందులో గెలిచిన వారికి ఈ అపారమైన మొత్తాన్ని అందించాలని అనుకున్నాడు. కానీ ఆ పజిల్ ను ఎవరూ పరిష్కరించకపోవడంతో పోటీదారులందరికీ ఆ డబ్బును పంచాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో అక్టోబర్ 22న ఆరుగంటలకు ఆ డబ్బును పంచుతానని పోటీదారులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆ సమయానికి రావాల్సిందిగా ఓ ప్రదేశాన్ని మెయిల్‌ద్వారా సమాచారం ఇచ్చాడు.
బార్టోషేక్ అనుకున్న సమయానికి నిర్దేశించిన ప్రాంతానికి ఓ కంటైనర్‌లో ఒక మిలియన్ డాలర్లను నింపుకొని వెళ్లాడు. హెలికాఫ్టర్ ద్వారా లాబెమ్ పట్టణానికి సమీపంలోని ప్రదేశంలో ఆ డబ్బును జారవిడిచాడు. ఆ మొత్తం డబ్బు విలువ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.8 కోట్లకు పైమాటే. ఇక ఆ డబ్బుకోసం అక్కడున్న వారు పోటీపడి మీరీ దాన్ని పోగు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కమిల్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.