ఆషాడమాసంలో గోరింటాకు వేడుకలు 

ఆషాడమాసంలో గోరింటాకు వేడుకలు 

ఆషాడ మాసం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గోరింటాకు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు ఘనంగా జరిగాయి. పద్మశాలి ఆడపడుచుల ఆషాఢమాస గోరింటాకు వేడుకలను శ్రీ కృష్ణ కాలనీ, ద్వారకా నగర్ లో ఘనంగా నిర్వహించారు. గోరింటాకు రుబ్బి అందంగా చేతులకు పెట్టుకున్నారు. 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో గోమాత భజన మండలి ఆధ్వర్యంలో ఆషాఢమాసం గోరింటాకు వేడుకలు ఆకట్టుకున్నాయి.  చేతులు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకొని అమ్మాయిలు మెరిసిపోయారు.  అక్కడక్కడా మెహిందీ వేడుకలను కూడా నిర్వహించారు.  గోరింటాకు అలంకరణతో శరీరంలోని నాడులన్నీ చల్లబడతాయని మహిళలు చెబుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న గోరింటాకు మొక్కలను హరితహారం కింద పంపిణీ చేయాలని మహిళలుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.