విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన లోక్ సభ

విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన లోక్ సభ

విపక్షాల ఆందోళనతో  లోక్ సభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళన చేయడం, పదే పదే  సభ వాయిదా పడటంతో సభను ఫిబ్రవరి 9 ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.

ఫిబ్రవరి 6న ఉదయం   అమెరికా- ఇండియా డీల్ ,ఆర్మీ మాజీ చీప్ నరవణె  రాసిన బుక్ వివాదంపై ప్రధాని మోదీ మాట్లాడాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.  ట్రంప్ మోదీ బ్యానర్ తో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. దీంతో స్పీకర్  సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభమైనా  కాసేపటికే  విపక్ష ఎంపీలు ఆందోళన ఆపకపోవడంతో స్పీకర్ సీరియస్ అయ్యారు. 

ALSO READ : కొరియన్లలా మారారు.. కొరియా వెళ్లాలని గొడవ చేశారు

విపక్షాల ఆందోళనతో  19 గంటల 13 నిమిషాల సభ సమయం వృథా అయ్యిందన్నారు. ప్రజలు ఎన్నుకుంది చట్ట సభల్లో చర్చించడానికి తప్ప..ఆందోళనలు చేయడానికి కాదని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయినా  విపక్షాల ఆందోళన విరమించకపోవడంతో సభను ఫిబ్రవరి 9  ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. 

అలాగే సస్పెండ్ కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మూడోరోజు నిరసనకు దిగారు.  కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానలపై నిరసనకు దిగారు.  ఇండియా,యూఎస్  మధ్య  డీల్ ట్రాప్ డీల్ అంటూ ఆరోపించారు.  కేంద్రం పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ విమర్శించారు. 

ALSO READ : 3 నెలల్లో కవిత కొత్త పార్టీ..ముహూర్తం కోసం వెయిటింగ్