భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు సిస్టర్స్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 16, 14, 12 ఏళ్ల వయసున్న ఈ ముగ్గురు చిన్నారులు తొమ్మిదో అంతస్తు కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కేవలం కొరియన్ సంస్కృతి పట్ల వ్యామోహం, ఆన్‌లైన్ ప్రపంచంలో గడపడం వారి ప్రాణాల మీదకు తెచ్చిందని తల్లిదండ్రులు చెప్పిన విషయాల ప్రకారం వెల్లడైంది.
పోలీసుల దర్యాప్తులో బాలికల తండ్రి చేతన్ కుమార్ విస్తుపోయే నిజాలు వెల్లడించారు. తన ముగ్గురు కుమార్తెలు సొంతంగా ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకున్నారని చెప్పారు. గత ఏడాది వారు ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. కొరియన్ డ్రామాలు, కార్టూన్ పాత్రలపై వీడియోలు చేసేవారని వెల్లడించారు. ఎల్సా, సిండ్రెల్లా వంటి పాత్రల తరహాలో ఆహార్యాన్ని మార్చుకుని, తాము కూడా కొరియన్లుగా మారిపోవాలని కలలు కనేవారని చెప్పారు. సుమారు 1000 మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఛానెల్ దాదాపు 10 రోజుల కిందట సిస్టర్స్ డిలీట్ చేసినట్లు తండ్రి వెల్లడించారు. తాను తన పిల్లలను ఇండియన్స్ గానే పెంచాలని అనుకున్నట్లు కుమార్ చెప్పారు.
ALSO READ : ప్రెగ్నెంట్ చేసినోడు.. DNAలో దొరికిండు..
కుమార్ స్టాక్ ట్రేడర్‌గా పనిచేస్తూ ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. పిల్లల కోరిక మేరకు ఫోన్లు కొనిచ్చారు. తనకు ఉన్న రూ.30 లక్షల అప్పు తమ పిల్లల మరణానికి కారణం కాదని స్పష్టం చేశారు. అయితే వారు భారతీయ సంస్కృతిని మర్చిపోయి పూర్తిగా కొరియన్ అలవాట్లకు బానిసలవుతున్నారని గ్రహించి, పది రోజుల క్రితం వారి యూట్యూబ్ ఛానెల్‌ను డిలీట్ చేయించారు. మనం భారతీయులం, భారతీయ పద్ధతుల్లోనే ఉండాలని ఆయన మందలించడం వారికి నచ్చలేదు. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా వారు "కొరియా వెళ్తాం" అని పట్టుబట్టగా.. తండ్రి వారించడంతో మనస్తాపానికి గురయ్యారు. వారు క్రియేట్ చేసుకున్న ఒక కలల ప్రపంచం నుంచి బయటకు రావటానికి తండ్రి చేసిన ప్రయత్నాలు వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటాయని దీని ద్వారా తెలుస్తోంది.
ALSO READ : కార్ను ఫుల్ రేజ్ చేస్తూ మహిళపైకి ఎక్కించేందుకు ఎలా వెంటాడాడో చూడండి
మంగళవారం అర్ధరాత్రి వరకు తల్లి ఫోన్ వాడుతూ గడిపిన ఈ ముగ్గురు సిస్టర్స్.. తెల్లవారుజామున 2 గంటల సమయంలో లేచి పూజ గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు. అక్కడ తమ ఫోటోలను నేలపై చల్లి, డైరీలో ఒక నోట్ రాశారు. "సారీ పాపా.. ఐ యామ్ రియల్లీ సారీ" అని రాసి.. కిటికీ నుండి కిందకు దూకేశారు. పోలీసులకు ఆ గది గోడలపై "నేను ఒంటరిని", "నా మనసు ముక్కలైంది" వంటి నిరాశతో కూడిన రాతలను చూశారు.
సొసైటీ వాసుల రియాక్షన్ ఏంటి..?
ఈ ఘటనపై భారత్ సిటీ నివాసితులు షాక్‌కు గురయ్యారు. ముగ్గురు పిల్లలు ఒకేసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నమ్మశక్యం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలికలు అసలు బయటకు వచ్చేవారు కాదని, పార్కులో ఆడుకోవడం లేదా ఇతర పిల్లలతో మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని పొరుగువారు చెబుతున్నారు. కరోనా తర్వాత వారు స్కూలుకు వెళ్లడం కూడా మానేశారని.. కేవలం ట్యూషన్లకు మాత్రమే వెళ్లేవారని అపార్మెంట్ వాసులు చెబుతున్నారు.
ALSO READ : ఇలాంటోళ్లు ఉంటే ఏంటి, పోతే ఏంటి..?
మరణించిన బాలికలు మొబైల్ ఫోన్లకు తీవ్రంగా బానిసలయ్యారని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు డీసీపీ నిమిష్ పాటిల్. ఆన్‌లైన్ ప్రపంచమే నిజమైన లోకం అని భ్రమపడటం.. అక్కడ తమకు ఇష్టమైన గుర్తింపును కోల్పోయినప్పుడు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు? వారు ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? అన్న విషయాలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
