చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన కిషన్రెడ్డి

చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన కిషన్రెడ్డి

గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు నల్లకుంటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లకుంట శంకర్ మఠ్ వద్ద బీజేపీనేతలు, జీహెచ్ ఎంసీ సిబ్బందితో కలిసి చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఇది ఒక్క రోజు చేసే కార్యక్రమం కాదు.. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని కోరారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో కూడా గాంధీజీ స్వచ్ఛతను పాటించడంలో ముందుండేవారని కిషన్ రెడ్డి అన్నారు.

పరిశుభ్రత లోపం కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనన్నారు కిషన్ రెడ్డి. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ తమ పరిసర ప్రాంతాల్లో  శుభ్రతను కలిగి వుండటం చాలా ముఖ్యమన్నారు కిషన్ రెడ్డి.