జూన్ 3 నుంచి 19 వరకు బడి బాట

జూన్ 3 నుంచి 19 వరకు బడి బాట

జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.  జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానుండటంతో బడిబాటలో భాగంగాలో జూన్ 19 వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాళ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. 

బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయం, అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం , బడి ఈడు పిల్లలు, బాలలు, బాల కార్మికులు, బడి బయట పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించనున్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసుకొని పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు ఇంగ్లీషు మీడియం బోధన అందిస్తుండటంతో ప్రవేశాలు పెంచేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. 

ప్రభుత్వ పాఠశాల్లో అనుభవజ్ణులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. దీంతో పిల్లల చదువుకోసం తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకపోగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించనుంది. 

జూన్ 12 నుంచి 19 వరకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు  తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాల విద్యాశాఖ అవసరమైన కార్యక్ర మాలను నిర్వహించనుంది.ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం విద్యార్థులను చేర్చడమే లక్ష్యంగా బడి బాట కార్యక్రమం పై ఆదేశాలు జారీ చేసిన విద్యా శాఖ.