పాకిస్థాన్.. ఉగ్రవాదం కంట్రోల్ చేసి మాట్లాడు : అసదుద్దీన్ ఒవైసీ

పాకిస్థాన్.. ఉగ్రవాదం కంట్రోల్ చేసి మాట్లాడు : అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ 61వ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ… పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు చేశారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలను కంట్రోల్ లో పెట్టాలని హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ లౌకిక వాది అని.. అలాంటి టిప్పు సుల్తాన్ గురించి ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంటులో తప్పుగా మాట్లాడారని అన్నారు. టిప్పు సుల్తాన్ ముస్లిం అయినా… హిందువులతోనూ కలిసి మెలిసి ఉన్నాడని చెప్పారు. అలాంటి వ్యక్తి పేరు పలికే అర్హత ఇమ్రాన్ ఖాన్ కు లేదని అన్నారు. మరోవైపు ప్రధాని మోడీకీ కౌంటర్ ఇచ్చారు అసద్. దేశం బలంగా ఉండాలంటే… బీజేపీ  సమావేశాలతో కాదు….. దేశ సరిహద్దులు బలంగా ఉండాలన్నారు.