పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉంది: అసదుద్దీన్ ఒవైసీ

పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉంది: అసదుద్దీన్ ఒవైసీ

పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వం నటించొద్దన్నారు MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. అమాయకత్వం అనే ముసుగును ఇమ్రాన్ తొలగించుకోవాలన్నారు. పుల్వామా ఉగ్రదాడికి కచ్చితంగా పాకిస్తాన్ కు లింక్ ఉందన్నారు. పాకిస్తాన్ లో జైషే మొహమ్మద్ కాకుండా జైషే షైతాన్ పనిచేస్తోందని మండిపడ్డారు. మసూద్ అజహర్ మౌలానా కాదని… దెయ్యం అన్నారు ఒవైసీ. భారతీయ ముస్లింల గురించి పాకిస్తాన్ బాదపడాల్సిన అవసరంలేదని… జిన్నా సిద్ధాంతాలను వ్యతిరేకించి తామంతా భారత్ లో ఉండిపోయామన్నారు. భారత్ లోని ఆలయాల్లో గంటలు మోగకుండా చేస్తామన్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఒవైసీ. భారత్ లో ముస్లింలు బతికున్నంత కాలం ఆలయాల్లో గంటలు మోగుతాయన్నారు.