- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి
పెద్దపల్లి,/జగిత్యాల టౌన్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో, మంథని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, సుల్తానాబాద్, గోదావరిఖని, జూలపల్లి, ధర్మారం మండల కేంద్రాల్లో కాకా ఫొటోలు, విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత కాకా అని కొనియాడారు.
జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీసులో అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, పోలీసు అధికారులు కాకా ఫొటో వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కోరుట్లలో ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు బలిజ రాజారెడ్డి ఆధ్వర్యంలో కాకా ఫొటోకు నివాళులర్పించారు.
కాకాకు భారతరత్న ప్రకటించాలి
గోదావరిఖని, వెలుగు: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి అభినవ అంబేద్కర్ అని, ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని గోదావరిఖని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పి.మల్లికార్జున్, కాంగ్రెస్ సీనియర్లీడర్గుమ్మడి కుమారస్వామి డిమాండ్ చేశారు. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ లేబర్అడ్డాలో అల్పహారం అందజేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్, మున్సిపల్కార్పొరేషన్ఆఫీస్లో కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆల్ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆధ్వర్యంలో కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
