న్యూఢిల్లీ: జపాన్ సెమికండక్టర్ సంస్థ రోమ్ కో, టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత్ లో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేసేందుకు ఇరు సంస్థలు చేతులు కలిపాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లే లక్ష్యంగా పవర్ సెమికండక్టర్ల తయారీపై దృష్టి సారిస్తాయి. రోమ్ టెక్నాలజీ, టాటా అసెంబ్లీ సామర్థ్యాలను ఈ భాగస్వామ్యం అనుసంధానిస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఆటోమొబైల్ గ్రేడ్ ఎన్సీహెచ్ 100వీ, 300ఏ ఎస్ఐ మాస్ఫెట్ తయారీ ప్రారంభం కానుంది. గుజరాత్ ధోలేరాలో 11 బిలియన్ డాలర్లు, అస్సాం జాగీరోడ్ లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టాటా సెమికండక్టర్ కేంద్రాలను నిర్మిస్తోంది.
