ముస్లింలను తిట్టడమే మోదీ పని.. ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నరు: అసదుద్దీన్ ఒవైసీ

ముస్లింలను తిట్టడమే మోదీ పని.. ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నరు: అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: ముస్లింలను తిట్టి ఓట్లు పొందాలనేదే.. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2002 నుంచి ఆయన ఇదే ఫాలో అవుతున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఒక మార్గంగా ఎంచుకున్నారని విమర్శించారు. హిందువులను భయాందోళనకు గురి చేయడం ద్వారా ఓట్లు పొందాలనే ఎత్తుగడే తప్ప.. ఆయనకు మరో ఆలోచన లేదన్నారు. ముస్లింలను ఎప్పుడూ చొరబాటుదారులుగా, ఎక్కువ సంతానం ఉన్నవారుగా మోదీ చిత్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కొని ముస్లింలకు పంచుతుందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.