శివుడికి ఇవి సమర్పించండి... వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది.

శివుడికి  ఇవి సమర్పించండి... వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది.

కార్తీక మాసం తరువాత పరమేశ్వరుడికి ఇష్టమైనది ఆషాఢమాసం.  ఈ నెలలో ( ఆషాఢమాసంలో పరమేశ్వరుడిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పరమేశ్వరుడిని పూజించేటప్పడు బోలేనాథ్​కు ఈ వస్తువులను సమర్పిస్తే మహాశివుడి ఆశీస్సులు పుష్కలంగాఉంటాయని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .  . .

 కార్తీక మాసం తరువాత శివుడిని ప్రసన్నం చేసేందకు ఆషాఢమాసంలో శివుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో  శివలింగాన్ని కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పూజించాలి.  శివలింగానికి ఉదయం (బ్రహ్మముహూర్తంలో) జలంతో అభిషేకం చేయాలి.  అవకాశమున్నవారు సోమవారం ఉపవాస దీక్షను పాటించాలి. 

ALSO READ : ఎవరు గురువు.. గురువు అంటే ఎవరు..?

 

  • పంచామృతం :  పాలు... పెరుగు... నెయ్యి.... తేనె ... చక్కెరతో చేసిన పంచామృతాన్ని శివలింగానికి సమర్పించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.  నిరుద్యోగులకు జాబ్​ వస్తుంది. పెళ్లికాని వారు పంచామృతంతో ఏకాదశ రుద్రాభిషేకం ( 11 సార్లు) చేసినట్లయితే  అనుకూల సంబంధం కుదురుతుందని పండితులు చెబుతున్నారు.
  •  గంగా జలం: శివలింగాన్ని గంగా జలంతో అభిషేకం చేయడం వలన  14 జన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.  
  • బిల్వపత్రం: పరమేశ్వరుని మారేడు ఆకు ( బిల్వ పత్రం)తో పూజించాలి.  గంధం తో  ఓం నమ:శివాయ అని రాసి సమర్పిస్తే మోక్షం కలుగుతుంది. 
  • భస్మం (విభూతి) :  బోలేనాథ్​ కు విభూతి అంటే చాలా ఇష్టం.  శివలింగాన్ని భస్మంతో అలంకారం చేసి.. గంధంతో .. కుంకుమతో బొట్టు పెట్టాలి.  ఆ తరువాత శివలింగానికి సమర్పించిన విభూతిని నుదుటున పెట్టుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.  దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు.   స్వామి వారిని అలంకారం చేసేముందు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం సంప్రదాయం.   బిల్వపత్రం.. గంగాజలం.. వీటిలో ఔషధమూలకాలుంటాయి. 
  • ఆవుపాలు .. ఆవు పెరుగు : శివలింగాన్ని  పాలు.. పెరుగుతో అభిషేకం చేయడం వలన మానశిక ప్రశాంతత కలుగుతుంది. 
  • తేనె.. ఆవు నెయ్యి : శివలింగాన్ని వీటితో అభిషేకం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండాసాగిపోతుందని పండితులు చెబుతున్నారు. 
  • పండ్లు:  మహాదేవునికి కొబ్బరి.. యాపిల్​.. అరటిపండ్లు సమర్పించడం వలన  కోరికలు నెరవేరుతాయి.
  •  తెల్లని పువ్వులు: పరమేశ్వరునికితెల్లని పూలు సమర్పించడం వలన  చాలా కాలంగా పెండిగులో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు. 

గమనిక: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీ సమస్యలకు  పండితులను  సంప్రదించటం ఉత్తమం.