
మనిషి తల్లి కడుపులోనే అన్నీ నేర్చుకుని బయటకు రాడు. బయటపడ్డాక ఎదుటి వాళ్లను చూసి నేర్చుకుంటాడు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు మనకు ఏదో ఒక విధంగా సాయంచేస్తూనే ఉంటారు. అది మాట సాయం కావొచ్చు. పని సాయం కావొచ్చు. ఎవరి సాయం లేకుండా మనిషి బతకగలడా?.. అందుకే పుట్టగానే అమ్మానాన్నలతో, పెద్దయ్యాక జీవిత భాగస్వామితో, ముసలితనం వచ్చినంక పిల్లలతో గడుపుతాడు. మాటలు అమ్మ నేర్చితే.. నడకలు నాన్న నేర్పుతాడు. చదువు, జ్ఞానాన్ని బడిలో గురువు పంచుతాడు. ఈ జీవితాన్నిఏ దారిలో నడిపించాలి? ఏ దారిలో ఎముంటాయ్.. ఎటువైపు ఎట్లా నడవాలి? అని చెప్పి, నడిపించడం ఒక్క గురువుకే సాధ్యం.
గురువు అంటే..
సంస్కృతంలో 'గు' అనే శబ్దానికి చీకటి అని అర్ధం 'రు' అంటే నాశనం చేసే తేజన్సు అని అర్ధ. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువని అర్ధం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్పు, అజ్ఞానాన్ని తొలగించే గురువు జ్ఞానసంపన్నుడు, గుణసంపన్నుడై ఉంటాడు. అంతేగానీ ఆయనకు అందమైన రూపంతో ఉండాలనేం లేరు. గురువు రూపాతీతం.
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేన:.. అని చిన్నప్పుడు టీచర్ క్లాస్ ల అడుగు పెట్టగానే పాడుకునేవాళ్లం కదా! గురునే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అలాంటి గురువుకి నమస్కరిస్తున్నాను' అని దీనికి అర్ధం. గురువులకు మన సంస్కృతి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో ఈ శ్లోకం చెబుతుంది.
ALSO READ : గురు, శిష్యుల బంధంపై పురాణాల నుంచి నేటి వరకు చరిత్ర నేర్పిన పాఠాలు
కేవలం మనకు చదువు చెప్పేవాళ్లే గురువులు కాదు. జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్లెవరైనా మనకు గురు సమానులే. ఒక గొప్ప గురువు తన శిష్యునికి ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో ఆ గమ్యానికి దారి చూపిస్తాడు. దానికోసం ఆయన దగ్గరున్న జ్ఞానాన్ని పంచుతాడు. తను నడితొచ్చిన దారుల్లో కలిగిన అనుభవాలను చెప్తాడు. ఎటు పోతే ఏంఉంటది, ఏమైతదో చెప్పి మిమ్మల్ని మీరు వెలిగించుకునేలా డైరెక్షన్ చేస్తాడు. ఇందుకు గురువు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా వినాలి. ఆ తర్వాత సందేహాలు అడగాలి. నిజమైన గురువే మీకు మాత్రమే మీరు జీవితాంతం సపోర్ట్ గా నిలబడ్డాడు. కష్టకాలంలో కన్నీరు, మున్నీరవుతూ ఆయన కాళ్లదగ్గరకు చేరితే తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు.
ఎవరు గురువు?
చిన్నప్పటి నుంచి మనం ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటం. కానీ, అందరూ జీవితం పై ముద్ర వెయ్యలేరు. మన జీవితాన్ని తీర్చిదిద్దే గురువు ఎలా ఉంటాడు. ఇంటే. పురాణాల్లో ఇలా వివరించాయి. అందులో కొన్ని..
- సత్యాన్ని పాటిస్తాడు.
- సమస్త జీవరాశుల పట్ల దయకో ఉంటాడు.
- ప్రశాంతమైన మనసు కలిగినవాడు.
- నిగ్రహ, అనుగ్రహ శక్తులు ఉన్నవాడు.
- పరమభక్తుడు, వేద, జ్ఞాన సంపన్నుడు.
- యోగం తెలిసినవాడు..
- శిష్యుడి తప్పుని గుర్తించగలిగినవాడు