Guru Purnima : గురు, శిష్యుల బంధంపై పురాణాల నుంచి నేటి వరకు చరిత్ర నేర్పిన పాఠాలు

Guru Purnima : గురు, శిష్యుల బంధంపై పురాణాల నుంచి నేటి వరకు చరిత్ర నేర్పిన పాఠాలు

ఆషాఢమాసం శుక్ల పక్ష పౌర్ణమిని 'గురు పౌర్ణమి' అనిగానీ, 'వ్యాస పౌర్ణమి' అనిగానీ అంటారు. అన్ని పండుగల కంటే గురుపౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు కృతజ్ఞత చెప్పుకోవడమే గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ గురువులను పూజిస్తారు. ఈ వేళ వ్యాసమహర్షి పుట్టిన రోజు కూడా!

వశిష్టుడు, వాల్మీక్ లాంటి తపశ్శక్తి సంపన్ను లు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికి మన ప్రాచీనులు అగ్రపీఠం చేశారు. ఎందుకంటే.. ఒకే రాశిగా ఉన్న వేదాన్ని బుగ్, యజు, సామ, అధర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించినవాడు వ్యాసుడు.
ఆయనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. మహాభారతం, భాగవతాలను రచించారు. శ్రీకృష్ణుడి రూపంలో ప్రపంచానికి భగవద్గీత బోధించాడు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించి, దాని ద్వారా భారతీయ సంస్కృ తికి పునాదిరాళ్లు వేశాడు. 

శక్తి భక్తి, శీలం, సహజీవనం, సనాతన ధర్మం, పవిత్రత,  దానధర్మాలు ఈ దేశ సహజలక్షణాలుగా రూపొందటానికి మూలం వ్యాసుడి రచనలే. ఇంతటి మహారుషిని భారతజాతికి గురువుగా భావించి చేసే పూజే గురుపౌర్ణమి'. భగవద్గీతలో కృష్ణుడు.. 'మునుల్లో నేను వ్యాసుడిని" అంటాడు. ఇక్కడ గురువు దేవునితో సమానమని చెప్పకనే చెప్పాడు.

నిజమైన గురువు తన శిష్యల భ్రమల్ని పటాపంచలు చేస్తాడు.. అతని సమక్షంలో ఉన్నపుడు శిష్యుడు కంఫర్ట్, సంతోషాన్ని ఫీలవుతాడు. నిజాలు చెప్తూ తమకు తామే రియలైజ్ అయ్యేట్టు చేస్తాడు. గురువు ఆలోచనలు, ఆచరణ ఒకేవిధంగా ఉంటాయి. నిజమైన గురు, శమ్యల మనసులు కలిసి ఉంటాయి.  జీవితంలో మీరు కోరుకున్నది ఎవరూ ఇదిగో తీసుకో' అని తెచ్చివ్వరు, కాబట్టి దాన్ని మీరే తెచ్చుకోవాలె. దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో చెప్పి మేలుకొలుపేది గురువే. 

సమర్థ రామదాస్ వీరశివాజీని తయారు చేశాడు. తన ఉపన్యాసాలతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుడిని రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దాడు. బుద్దుడు, వర్ధమాన మహావీరుడు, భగవాన్ రమణమహర్షి వంటి ఎందరో మహా మహా గురువుల బోధనలు మనదేశాన్ని ధర్మమార్గంలోసడిపిస్తున్నాయి.

-V6 వెలుగు