హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (జీఎం)గా ఆశిష్ మెహ్రోతా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఉత్తర రైల్వేలో చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజనీర్ (సీఈడీఈ)గా విధులు నిర్వర్తించేవారు.
ఆయన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఈఈ)1992వ బ్యాచ్‌కు చెందిన అధికారి. లోకోమోటివ్స్ వర్క్స్ లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా సేవలను అందించారు. అనంతరం నార్తర్న్ రైల్వేలో చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజనీర్‌గా పని చేశారు.
ఆశిష్ మెహ్రోత్రా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, ఎనర్జీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏను పూర్తి చేశారు. ప్రెసిడెంట్ మెడల్ (ఆర్ఎస్ సీ), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్స్ అవార్డు అందుకున్నారు.
