ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్: రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రెడ్ డైరీ అంశం, బెట్టింగ్ యాప్ పేరు తో బీజేపీ కుట్రలు చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘రెడ్ డైరీ అనేది బీజేపీ కుట్ర. దీనిపై ప్రధాని మాట్లాడితే పెద్ద ఇష్యూ అవుతుందని వాళ్లు అనుకు న్నారు. అలానే మహాదేవ్ యాప్ కేసు కూడా. ఈడీ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కానీ ఇన్వెస్టిగేషన్ చేయలే. ప్రధాని మాత్రం మాట్లాడు తూనే ఉన్నారు” అని అశోక్ గెహ్లాట్​మండిపడ్డారు.