ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంబంధం లేదు..

ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంబంధం లేదు..

ఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనా.. సీఎం అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలంటూ ఆయన వర్గానికి చెందిన 90 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా వేశారు. ఈ చర్యలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టగా.. పార్టీ హైకమాండ్ సైతం సీరియస్ గా తీసుకుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా సైతం సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీనియర్ నేత మల్లిఖార్గున ఖర్గే గెహ్లాట్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గెహ్లాట్ ఖర్గేను క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న రాజస్థాన్ సీఎం మంగళవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే గెహ్లాట్ కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో విజయం సాధించినా రాష్ట్ర సీఎంగా ఆయనను కొనసాగించాలని 90 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సోనియా నిర్ణయాన్ని గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు ధిక్కరించడంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమైంది. అధ్యక్ష బరి నుంచి ఆయనను తప్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే సీఎం అశోక్ గెహ్లాట్ తో భేటీ కాగా.. ఆయన క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది