కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..సీఎం పీఠంపై గెహ్లాట్ ఆందోళన

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..సీఎం పీఠంపై గెహ్లాట్ ఆందోళన

20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ..అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైంది. ఈ ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని..ఎవరైన పోటీ చేయొచ్చని ఇప్పటికే ఆ పార్టీ తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు రాహులే అధ్యక్ష పదవి చేపట్టాలని తీర్మానాలు చేశాయి.  ఆధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు శశిథరూర్ తెలుపగా..ఈ పోటీలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

అశోక్ గెహ్లాట్ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీచేసేలా రాహల్ గాంధీని ఒప్పించడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. పార్టీ పగ్గాలు అశోక్ గెహ్లాట్కు అప్పగించేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉన్నప్పటికీ.. అది చేపడితే సీఎం పీఠానికి దూరం కావాల్సివుంటుందని గెహ్లాట్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాను అధ్యక్ష బాధ్యతలు చేపడితే సీఎం కుర్చీ సచిన్ పైలట్ కు వెళ్తుందనేది గెహ్లాట్ ఆందోళనకు కారణం. అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ అంత ఇంట్రస్ట్ గా లేనట్టు తెలుస్తోంది. దీంతో గాంధీ కుటుంబేతర వ్యక్తి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లే చాన్స్ ఉంది. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేసన్ విడుదలకానుంది. 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. అక్టోబర్ 8 నామినేషన్ల ఉపసంహణకు చివరి తేదీ. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుండగా.. 19న ఫలితం తేలనుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్, 2000లో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు.