హైదరాబాద్, వెలుగు: మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా మద్దికాయల అశోక్ ఓంకార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ షహీద్ భగత్ సింగ్ నగర్ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన జాతీయ ఐక్యతా కన్వెన్షన్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే, 2018 నుంచి భిన్నాభిప్రాయాలతో రెండు వేర్వేరు కేంద్ర కమిటీలుగా పనిచేస్తున్న ఎంసీపీఐ(యూ) వర్గాలు ఏడాది కాలంగా జరిపిన చర్చల ఫలితంగా ఒక్కటయ్యాయి. ఈ సదస్సులో రెండు కేంద్ర కమిటీలను రద్దు చేసి ఒకే కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీకి అశోక్ ఓంకార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
