గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత : పోలీసుల అదుపులోకి అశ్వథామరెడ్డి

గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత : పోలీసుల అదుపులోకి అశ్వథామరెడ్డి

గన్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గన్ పార్క్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు.. ఆంక్షలు కొనసాగుతున్నాయంటున్నారు.  అటు నివాళులర్పించేందుకు వచ్చిన RTC JAC కన్వినర్ అశ్వథామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సీఎం నిర్ణయంపై మండిపడుతున్నారు నేతలు. సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు నిరాహార దీక్షను వాయిదా వేసుకున్నాయి కార్మిక సంఘాలు. దీక్షకు పోలీసుల అనుమతి లేకపోవటంతో దీక్షను వాయిదా వేయిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో ఊళ్లలోకి వెళ్లేందుకు సిద్దమైన జనానికి పండగ పూట…. ప్రయాణం కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిపోకపోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు జనం. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ప్రవేటు యాజమాన్యాలు… జనం దగ్గర డబుల్ చార్జీలు వసూల్ చేస్తున్నారు. వాహనాలు అవసరానికంటే ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు.