
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఏషియన్ పెయింట్స్‌లోని తన 4.9 శాతం వాటాను పూర్తిగా విక్రయించాలని ప్లాన్ చేస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్‌ను మేనేజ్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ అమెరికాను నియమించిందని అన్నారు. పెయింట్స్ సెక్టార్‌లో మార్జిన్ తగ్గిపోతుండడం, కాంపిటీషన్ పెరుగుతున్న సమయంలో ఆర్‌ఐఎల్ తన 17 ఏళ్ల పాత ఇన్వెస్ట్‌మెంట్‌ను క్యాష్ చేయాలని చూస్తోంది.
ఆర్‌ఐఎల్ ఏషియన్ పెయింట్స్‌లో వాటా విక్రయించాలని చూడడం ఇదేమి మొదటిసారి కాదు. 2020లో కూడా 4.9 శాతం వాటా విక్రయించేందుకు బ్యాంకులతో చర్చలు జరిపింది. రిలయన్స్ ఈ వాటాను 2008లో సుమారు రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. ఏషియన్ పెయింట్స్ షేర్లు బుధవారం రూ.2,282 వద్ద ముగిశాయి.