ఫేక్​ వాట్సాప్​, ఇన్​ స్టా అకౌంట్లతో ట్రాప్ చేసి కిడ్నాప్​లు

ఫేక్​ వాట్సాప్​, ఇన్​ స్టా అకౌంట్లతో ట్రాప్ చేసి కిడ్నాప్​లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫేక్ వాట్సాప్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్ నుంచి మాటలు కలిపి కిడ్నాప్స్​ చేస్తున్న గ్యాంగ్​ను ఆసిఫ్​నగర్​పోలీసులు అరెస్ట్​చేశారు. వెస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్ డీసీపీ జోయల్ డెవిస్‌‌‌‌‌‌‌‌తో కలిసి సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ మంగళవారం ప్రెస్​మీట్​లో  వివరాలు వెల్లడించారు. భోజగుట్ట శ్రీరాంనగర్​కి చెందిన గుంజపోగు సురేశ్ అలియాస్ సూర్య(27) పాత నేరస్థుడు. తన బ్రదర్​సుధాకర్​తో కలిసి పలు చోరీలు చేశాడు. ఓ కేసులో జైలుకెళ్లి గతేడాది ఫిబ్రవరిలో రిలీజ్​అయ్యాడు. ఈసారి పోలీసులకు చిక్కకుండా చోరీలు చేయాలని ప్లాన్ చేశాడు. అదే టైంలో ఓటీటీ యాప్స్​లో కొన్ని రాబరీ వెబ్​సిరీస్​లు చూశాడు. తర్వాత తన ఫ్రెండ్స్​ఎమ్.రోహిత్‌‌‌‌‌‌‌‌(18), ఇందూరి జగదీష్‌‌‌‌‌‌‌‌(25), కె.కునాల్‌‌‌‌‌‌‌‌(19), జగద్గిరిగుట్టకు చెందిన శ్వేతాచారి అలియాస్ స్వీటీతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. అందమైన యువతి ఫొటోలతో వాట్సాప్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేయించాడు. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ దగ్గర్నుంచి కలెక్ట్ చేసిన నంబర్లకు యువతి శ్వేతతో కాల్స్​ చేయించేవాడు. ఆమె ట్రాప్​లో పడిన వాళ్లతో కంటిన్యూస్​గా మాట్లాడుతూ స్పాట్​ఫిక్స్​చేసి కిడ్నాప్ చేసేవారు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ​చేసి డబ్బు డిమాండ్​ చేసేవారు. అలా నలుగురిని కిడ్నాప్​చేసి రూ.10లక్షలు వసూలు చేశారు. 
గుడిమల్కాపూర్​కు చెందిన ప్రశాంత్ ను ఈ నెల 5న కిడ్నాప్​చేశారు. 6వ తేదీ సాయంత్రం ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ బ్రదర్ ‌‌‌‌‌‌‌‌ఆంజనేయులుకి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ వాట్సాప్​నంబర్​నుంచి కాల్​వచ్చింది. ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. బయపడిపోయిన కుటుంబ సభ్యులు నార్సింగి ఓఆర్ఆర్​బ్రిడ్జి వద్ద కిడ్నాపర్స్​కు రూ.50 వేలు ఇవ్వడంతో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ను వదిలేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు ఫైల్​చేసిన ఆసిఫ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు సురేశ్​తోపాటు రోహిత్‌‌‌‌‌‌‌‌, జగదీష్‌‌‌‌‌‌‌‌, కునాల్​​ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కు ఉపయోగిస్తున్న కారు, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న యువతి కోసం సెర్చ్ 
చేస్తున్నారు.