కాగజ్ నగర్, వెలుగు: అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకం సర్వేను అధికారులు సమన్వయంతో సమర్థంగా నిర్వహించాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం కాగజ్ నగర్లోని ఎంపీడీవో ఆఫీస్లో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.
క్రమబద్ధీకరణ కోసం అందిన ప్రతి దరఖాస్తులు రికార్డులతో సరిచూసి, క్షేత్రస్థాయిలో భౌగోళిక పరిస్థితిని పరిశీలించి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కాగజ్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో గోడ కూలిన
ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.