మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు

మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు

కోటపల్లి, వెలుగు: మంత్రి వివేక్​ సమక్షంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్​పల్లి సర్పంచ్ అట్టెల ప్రభాకర్, ఉప సర్పంచ్ మారిశెట్టి రాజేశ్, వార్డు సభ్యులు అట్టెల తిరుపతి, అట్టెల లక్ష్మణ్, తలండి జంపన్న సోమవారం కాంగ్రెస్​లో చేరారు. వారికి మంత్రి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం, మంత్రి వివేక్​ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై కాంగ్రెస్​లో చేరినట్లు వారు తెలిపారు.

కార్యక్రమంలో కోటపల్లి, పంగిడి సోమారం సర్పంచులు ఆలూరి సంపత్, పోలం రాకేశ్, సీనియర్​ కాంగ్రెస్​ లీడర్​ భూషణ్​శర్మ, బోయిని నగేశ్​ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాకు చెందిన చంటి మల్లేశ్వరి కుటుంబానికి మంత్రి వివేక్​ వెంకట స్వామి రూ.10వేలను, కాలనీ వాసులు సేకరించిన మరో రూ.30 వేలను కుటుంబ సభ్యులకు అందించారు.