తిర్యాణి, వెలుగు: 9 నుంచి 14 ఏండ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ హరిత సూచించారు. మంగళవారం చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను నీతి ఆయోగ్ ప్రతినిధితో కలిసి తనిఖీ చేశారు. రోగులకు తాగునీరు అందించే ఆర్‌ఓ ప్లాంట్ ను రిపేర్చేయాలని ఆదేశించారు. పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని వంద సూచించారు.
విజయనగరం కాలనీలో నిర్మిస్తున్న మండల సమాఖ్య భవనాన్ని త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ అధికారి అప్న శర్మ, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్,
వెటర్నరీ డాక్టర్ సాగర్ ఉన్నారు.
