V6 News

ఇవాళ్టి(ఏప్రిల్ 26) నుంచి అస్మితా ఖేలో ఫుట్ బాల్ పోటీలు

ఇవాళ్టి(ఏప్రిల్ 26) నుంచి అస్మితా ఖేలో ఫుట్ బాల్ పోటీలు
  • ఫైనల్​కు హాజరుకానున్న మంత్రి వివేక్

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్​స్టేడియంలో ఆదివారం నుంచి జరుగనున్న అస్మితా ఖేలో ఇండియా ఫుట్​ బాల్ ​లీగ్​ఛాంపియన్​షిప్​-2026​ స్టేట్​లెవల్  ​పోటీలకు సర్వం సిద్ధమైంది. డీసీసీ ప్రెసిడెంట్, ఉమ్మడి ఆదిలాబాద్ ఫుట్​బాల్​అసోసియేషన్​ బాధ్యుడు పిన్నింటి రాఘునాథ్​రెడ్డి నేతృత్వంలో ఫుట్​బాల్​అసోసియేషన్, లెవన్​స్టార్ పీకేఆర్​క్లబ్, సింగరేణి యాజమాన్యం, దాతల సహకారంతో జరిగే ఈ అండర్​-16 బాలికల పోటీలు నాలుగు రోజుల సాగనున్నాయి. పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు తలపడనున్నారు.

పోటీలను సక్సెస్​చేయాలని రఘునాథ్​రెడ్డితోపాటు నిర్వాహకులు పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్​గౌడ్ కోరారు. స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు హాజరవుతున్నారని, ఈనెల 29న జరిగే ఫైనల్​కు మంత్రి వివేక్​ వెంకటస్వామి చీఫ్​గెస్ట్​గా వస్తున్నట్లు తెలిపారు.