హోరాహోరీగా సాగిన తెలంగాణ ఫుట్​బాల్

హోరాహోరీగా సాగిన తెలంగాణ ఫుట్​బాల్

కోల్​బెల్ట్​,వెలుగు: రామకృష్ణాపూర్​ సింగరేణి ఠాగూర్​ స్టేడియంలో శుక్రవారం రెండో రోజు అస్మిత ఖేలో ఇండియా  తెలంగాణ స్థాయి(సౌత్​జోన్​) అండర్​-13 గర్ల్స్​ ఫుట్​బాల్ పోటీలు​ హోరాహోరీగా సాగాయి. నిజామాబాద్ కేర్​ ఫుట్​బాల్​ అకాడమీ-హైదరాబాద్​ ట్విన్​ సిటీస్​ జట్ల జరిగిన పోటీల్లో కేర్​ ఫుట్​బాల్​ అకాడమీ జట్టు 4-0 గోల్స్​ తేడాతో గెలిచింది. హాకీంపేట్​ తెలంగాణ స్పోర్ట్స్​ స్కూల్​, ఆదిలాబాద్​ పీకేఆర్​ సాకర్​ క్లబ్​ మధ్య జరిగిన రెండో మ్యాచ్​లో తెలంగాణ స్పోర్ట్స్​ స్కూల్​ 2-1 గోల్స్​ తేడాతో విజయం సాధించింది.

మూడో మ్యాచ్​లో హైదరాబాద్​ ఉమెన్​ ఫుట్​బాల్​ క్లబ్​, గజ్వేల్​ జట్టుపై 10-0 గోల్స్ తేడాతో గెలిచింది. పోటీలకు ముఖ్య అతిథులుగా క్యాతనపల్లి మున్సిపల్​ కమిషనర్​ గద్దె రాజు, చైర్​ పర్సన్​ జంగం కళ,  వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డి, సింగరేణి ఎలక్ర్టికల్​ విభాగం  ఆర్కేపీ ఇన్​ ఛార్జీ  దుస్సా వెంకటేశ్వర్లు, ఫుట్​బాల్​ అసోసియేషన్​ జనరల్​ సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్​రెడ్డి, వైస్​ ప్రెసిడెంట్​ కట్ట ఈశ్వరచారి, గోపాల్ రెడ్డి, కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ పల్లె రాజు, గోపతి రాజయ్య, గాండ్ల సమ్మయ్య, మహంకాళీ శ్రీనివాస్ ​ ​ తదితరులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​లు అందజేశారు.