మంత్రి వివేక్ చొరవతో  హైమాస్ట్ లైట్ల ఏర్పాటు

మంత్రి వివేక్ చొరవతో  హైమాస్ట్ లైట్ల ఏర్పాటు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డులో మంత్రి వివేక్​చొరవతో  రూ.11లక్షల నిధులతో సోలార్​ హైమాస్ట్​ లైట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్​ అబ్రహాంనగర్​లోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్​ లైట్లను కాంగ్రెస్ నేత గాండ్ల సమ్మయ్య, వీణ దంపతులు ప్రారంభించారు.

వారు మాట్లాడుతూ.. మంత్రి వివేక్​ వెంకటస్వామి ఇచ్చిన హామీ ప్రకారం సోలార్​ హైమాస్ట్​ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంబురాలు నిర్వహించారు. కాలనీ మహిళలతో కలిసి కేక్​ కట్​చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేశ్, సురేశ్, కొమురయ్య, సత్తయ్య, ప్రవీణ, సునీత, శైలజ, భాగ్య పాల్గొన్నారు.----