గౌహతి: అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అస్సాం ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన రెవెన్యూ శాఖా మంత్రి కేశబ్ మహంత కూతురు దిబిసా మహంత CJP నిరసనల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
గురువారం గౌహతిలోని చచల్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలో ఈ బీజేపీ మంత్రి కూతురు భాగం కావడం విశేషం. NEET పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నట్టే అస్సాంలో కూడా జరిగాయి.
#WATCH: Assam Cabinet Minister Keshab Mahanta's daughter, Dibisa Mahanta, was among those who joined the CJP protest in Guwahati, where demonstrators demanded education reforms and the resignation of Union Education Minister Dharmendra Pradhan.#Assam #CJPProtest… pic.twitter.com/CJP2hjZFIc
— Northeast Now (@NENowNews) July 24, 2026
ఈ నిరసనల్లో ఒక బీజేపీ మంత్రి కూతురు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులకు న్యాయం జరగాలని నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఆమె నిరసన తెలిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా సదరు మంత్రి చిక్కుల్లో పడ్డారు.
బీజేపీ మంత్రి కూతురు ఈ Gen-Z నిరసనల్లో పాలు పంచుకోవడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. నిరసన తెలిపే విద్యార్థుల హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. ఈ నిరసన విద్యార్థుల నుంచి వ్యక్తమైందని.. వారి డిమాండ్లను గౌరవించి ప్రధాన మంత్రి ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సీఎం చెప్పారు.
►ALSO READ | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రంగం సిద్ధం..?: కాక్రోచ్ పార్టీతో మరోసారి కేంద్రం చర్చలు
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర యువత చేస్తున్న నిరసన తారా స్థాయికి చేరింది. రోజురోజుకూ ఈ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతుండటంతో పోలీసులు కూడా యువత నిరసనలకు అడ్డు పడే సాహసం చేయడం లేదు.
New video of Assam Minister Keshab Mahanta’s daughter goes viral now from the CJP’s Protest in Guwahati, questioning the Government.
— atanu bhuyan (@atanubhuyan) July 24, 2026
Previously, her Minister Father stated that she was lured to the protest by her friends in the pretext of tuition.
In the other video, she was… pic.twitter.com/wX452kyGO5
లాఠీ ఛార్జ్ కారణంగా ఢిల్లీ పోలీసు శాఖ తీవ్ర విమర్శల పాలైంది. అందుకే.. పోలీసులు ఈ నిరసనలపై ఆచితూచి అడుగులేస్తున్నారు. ఢిల్లీలోని అధికార యంత్రాంగం.. ఇప్పటికే ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను మూసివేస్తూ యువత ఢిల్లీకి రాకుండా.. వచ్చినా జంతర్ మంతర్కు రాకుండా ప్రయత్నం చేస్తుంది. ఇంటర్నెట్పై ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి.
