ఢిల్లీ: ఢిల్లీలో పరిణామాలు వేగంగా మరుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీతో మరోసారి చర్చలకు సిద్ధం అయ్యింది ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం. 2026, జూలై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్రం చర్చలకు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరగనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ పరిణామాలతో ఢిల్లీలో పలురకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోసారి చర్చలు జరిగే ముందే.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. అతని రాజీనామా తర్వాతనే చర్చలు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఈ డిమాండ్ విషయం తెలిసి కూడా కేంద్రం చర్చలకు ఆహ్వానించటం చూస్తుంటే.. కేంద్రం నుంచి బిగ్ బ్రేకింగ్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రంగం సిద్ధం అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయనను కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీతో పాటు పార్టీ ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే జరగొచ్చని వార్తలు బయటకు వస్తున్నాయి.
ఇప్పటికే 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశ వ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయాలపై ఇప్పటికే RSS సైతం తన వైఖరి వెల్లడించింది. పట్టువిడుపులు ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో.. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన కేంద్రం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
కాక్రోచ్ జనతా పార్టీతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధం అవుతున్న క్రమంలో.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖాయంగా కనిపిస్తుందని.. ఇంకా సాగదీస్తే అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే.. ఉద్యమాన్ని, పోరాటం సద్దుమణుగుతుందని.. అలా కాకుండా చేస్తే ప్రధాని మోదీ రాజీనామా డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం ఉందనే భయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ : ధర్మేంద్ర ప్రధాన్ను మరో శాఖకు బదిలీ చేసే చర్చలు నడుస్తున్నయ్
ఈ పరిణామాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రంగం సిద్ధం అయ్యిందని.. ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీని చర్చలకు ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.
