ఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ విషయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు తీవ్రతరం అవుతున్నప్పటికీ, ఆయనను మరో శాఖకు బదిలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం చెప్పారు.
CJP మూడు డిమాండ్లలో మొదటి డిమాండ్.. కీలకమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు గానీ, ఆయనతో రాజీనామా చేయించేందుకు గానీ సిద్ధంగా లేదని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ క్రమంలో.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిరసనల సెగ తగ్గించేందుకు విద్యా శాఖ నుంచి ఆయనను తప్పించి మరో శాఖ అప్పగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది.
VIDEO | Delhi: During a press conference, Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) says, “There is some talk going on. These days, we receive information from within the government. There is discussion in PM Modi's Cabinet that the solution is to move Dharmendra Pradhan from the… pic.twitter.com/fR0ghDf6UV
— Press Trust of India (@PTI_News) July 25, 2026
ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కొంత చర్చ జరిగిందని రాహుల్ చెప్పుకొచ్చారు. అవినీతిపరుడైన ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ నుంచి పక్కన పెట్టేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీ భేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. నిరసనకారులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
ALSO READ : కాక్రోచ్ జనతా పార్టీకి.. విదేశీ నిధులు అందుతున్నాయా అని అడిగితే..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే మరోసారి చర్చలకు ముందుకొస్తామని కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది.
