కాక్రోచ్ జనతా పార్టీకి.. విదేశీ నిధులు అందుతున్నాయా అని అడిగితే.. కేంద్రం ఏం చెప్పిందంటే..

కాక్రోచ్ జనతా పార్టీకి.. విదేశీ నిధులు అందుతున్నాయా అని అడిగితే.. కేంద్రం ఏం చెప్పిందంటే..

ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీకి, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న NEET పేపర్ లీక్ నిరసనలకు విదేశీ నిధులు అందుతున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలను కేంద్ర విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ తోసిపుచ్చింది.

ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు విదేశీ నిధుల సంబంధం లేదా విదేశీ ప్రమేయం ఉందని చెప్పడానికి తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన వారాంతపు సమావేశంలో MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ఈ ప్రకటనతో కాక్రోచ్ పార్టీకి విదేశీ నిధులు అందుతున్నాయని ప్రచారం చేస్తున్న వాళ్ల గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఇన్నాళ్లు తాము చేసిన ఈ ప్రచారంపై ఎదురు దాడి తప్పదని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. NEET పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రకు చెందిన అభిజీత్​ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ.  కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్​ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ముఖ్యంగా యువత నుంచి అనూహ్య మద్దతు దక్కింది.