అస్సాంను ముంచెత్తుతున్న వరదలు... 41కి చేరిన మృతుల సంఖ్య

అస్సాంను ముంచెత్తుతున్న వరదలు... 41కి చేరిన మృతుల సంఖ్య

డిస్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు జలమయం అయ్యాయి. గత 24 గంటల్లో నలుగురు చిన్నారులుసహా 10 మంది మృతి చెందారు. దీంతో వరదల కారణంగా ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 41కు చేరినట్లు అస్సాం డిజాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం వెల్లడించింది. గడిచిన ఒకరోజులో శివసాగర్ జిల్లాలో ముగ్గురు, జోర్హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు, చరైదియోలో ఇద్దరు, ధేమాజీ, కార్బీ ఆంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 

మరో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 939 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మొత్తం 6.53 లక్షల మందికిపైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. నిరాశ్రయులైన 3.13 లక్షల మందికిపైగా ప్రజలను అధికారులు సహాయ కేంద్రాలకు తరలించారు.