గద్వాల, వెలుగు: గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం గద్వాలలోని స్కూల్ కు వెళ్లేందుకు బస్టాప్ దగ్గర వేచి ఉండగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికకు మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు.
అక్కడి నుంచి బైక్ పై తీసుకొచ్చి గద్వాల మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వదిలేసి పరారయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బాలిక పేరెంట్స్కు చెప్పడంతో వారు రూరల్ పోలీసులకు శుక్రవారం కంప్లైంట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది. సీఐ టంగుటూరి శీనును సంప్రదించగా, గద్వాల రూరల్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశామని, త్వరలో పూర్తి వివరాలు చెబుతామని తెలిపారు.
