కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న మహిళపై ఓ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జేఎన్టీయూలోని ఓ విభాగానికి హెచ్ఓడీగా పని చేస్తున్న రాంజీనాయక్కు గెస్ట్ ఫ్యాకల్టీగా చేరిన మహిళతో పరిచయం పెరిగింది.
ఒకే సామాజిక వర్గం అనే నెపంతో మహిళకు దగ్గరైన ప్రొఫెసర్ తన అధికారాన్ని అవకాశంగా మలుచుకుని ఆమెను లైంగికంగా వేధించాడు. ఆఫీస్ పని పేరుతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆఫీసు పని పేరుతో అర్ధరాత్రి వరకు తనతో ఉండమని ఒత్తిడి చేశాడు. ఈ విషయం తెలిసి సదరు మహిళకు భర్తతో విభేదాలు తలెత్తాయి.
చివరికి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బాధితురాలు తన భర్తకు దూరంగా ఉంటుండగా, అప్పటి నుంచి ప్రొఫెసర్వేధింపులు మరింత ఎక్కవయ్యాయి. దీంతో విసిగిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

