తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు విజయ్
ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్కు వినతి
ఆసిఫాబాద్, జైనూర్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ సర్వేను షెడ్యూల్ ప్రాంతాల్లో నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ డిమాండ్ చేశారు. సోమవారం తుడుందెబ్బ జైనూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలిసి వినతిపత్రం అందించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న భూములపై కూడా తహసీల్దార్లకు పూర్తిస్థాయి అధికారాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్టడానికి రెడీ అయిందని, దీంతో ఏజెన్సీలలో అమలులో ఉన్న 1/70 , 1/59, పెసా చట్టాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములపై ఇతరు పెత్తనం వచ్చే చాన్స్ ఉంటుదని, వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రాంతాల్లో సర్వేను నిలిపివేస్తూ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. అంతకుముందు.. ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు.. ఎమ్మెల్యే ఆత్రం సక్కును కలిసి ప్రాపర్టీ సర్వేను నిలిపివేయాలంటూ వినతిపత్రం అందజేశారు. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేస్రం మోతిరాం, ఆదివాసీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు కుమ్ర దందేరావ్, తదితరులు పాల్గొన్నారు.
For More News..