
ఆస్తి పన్ను వసూళ్లలో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ ఆపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల 50 వేల మంది ప్రాపర్టీ టాక్స్ పేయర్స్ ఉండగా ఇప్పటి వరకు ( ఫిబ్రవరి 20 వ తేది వరకు) 13 లక్షల మందే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు. అంటే ఇంకా దాదాపు 6 లక్షల 50 వేల మంది ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.
జీహెచ్ ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం రూ.2వేల కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1450 కోట్ల మేర మాత్రమే చేరుకున్నారు. గత ఏడాది ఈ సమయానికి జీహెచ్ఎంసీ 1900 కోట్ల రూపాయల ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసింది. డిసెంబర్ తరువాత ప్రాపర్టీ ట్యాక్స్ కడితే 2 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. . వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్లను పెంచాలని నిర్ణయించిన అధికారులు నిర్ణయించారు. చాలామంది జీహెచ్ఎంసీ అధికారుల నోటీసులకు స్పందించడంలేదని.. అలాంటి వారి ఆస్తులను చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌ల ట్యాక్స్ ఎక్కువుగా ఉండటంతో ఆయా ప్రాపర్టీలపై అధికారులు ఫోకస్ చేశారు.