23 లక్షల ఎకరాల అసైన్డ్​ భూముల్ని పేదలకు పంచుతాం

23 లక్షల ఎకరాల అసైన్డ్​ భూముల్ని పేదలకు పంచుతాం
  • పాదయాత్ర తర్వాత భూములపై పోరాటం: సీఎల్పీ నేత భట్టి 

నల్గొండ, వెలుగు:  పీపుల్స్ మార్చ్​ పాదయాత్ర ముగిశాక రాష్ట్రంలో ప్రజల పక్షాన అసైన్డ్​భూ ములపై పోరాటం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం కనగల్​లో చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆయన మీడి యాతో  మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం 23 లక్షల ఎకరాల అసైన్డ్​ భూములను పేదలకు పంచిపెట్టిందని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్​ ప్రభుత్వం ఈ భూములన్నింటిని పేదల నుంచి లాక్కొందని ఆరోపించారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పేదల భూములను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు పంచి పెట్టిందని భట్టి చెప్పారు.

ప్రభుత్వ సొంతప్రయోజనాల కోసం కార్పొరేట్ కంపెనీలకు పం చిపెట్టిన 23 లక్షల ఎకరాల భూములపైన పోరా టం చేయాలని పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు. రాష్ట్ర పార్టీలో చేసిన తీర్మానానికి అధిష్ఠానం ఆమో దం తెలిపిందన్నారు. కాంగ్రెస్ ​హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఎంత?  బీఆర్ఎస్  చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటి ఆయకట్టు ఎంత? అనేది ప్రజలకు వివరిస్తామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నామని తెలిపారు.

వీ6, వెలుగును ప్రభుత్వం అడ్డుకోవడం దారుణం:భట్టి

ప్రజల పక్షాన నిలిచే ​వీ6 చానల్, వెలుగు పేపర్ ను  అధికారిక కార్యక్రమాలకు రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  ప్రభుత్వ డబ్బును కొన్ని పత్రికలకు యాడ్స్​పేరుతో  కోట్లకు కోట్లు ఇస్తూ,  మిగతా పత్రికలను అధికారిక కార్యక్రమాలకు కూడా రానివ్వమంటే అది  ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భట్టి తెలిపారు.