హైదరాబాద్, వెలుగు: అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) హైదరాబాద్‌లో తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2026 నిర్వహించింది. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ, స్థిరమైన రవాణా మార్గాలపై కీలక చర్చలు జరిగాయి. టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, 2028 నాటికి వంద శాతం గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును సాధిస్తామని తెలిపారు.
డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడంలో సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. టీజీఆర్ఈడీసీఓ వైస్ చైర్మన్ అనిలా వావిళ్ల మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణపై చర్చించారు. ఏఎస్సీఐకి చెందిన ప్రొఫెసర్ రాజకిరణ్ బిలోలికర్ గ్రిడ్ సామర్థ్యం, ఇంధన నిల్వ వ్యవస్థల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు.
