ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితం

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితం

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా  తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైనదన్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. ఈ వ్యాక్సిన్  కారణంగా ఎలాంటి హాని జరగదని భరోసాచ్చారు. కొన్ని ఐరోపా దేశాల్లో ఈ టీకా కారణంగా రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. భారత్‌, అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నారని.. దీన్ని వరల్డ్ వైడ్ గా వినియోగిస్తున్నారని తెలిపారు. బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన, అనుభవం కలిగిన వ్యవస్థ అని తెలిపారు. టీకా సురక్షితమైనదేనని వారు కూడా కన్ఫాం చేశారన్నారు. అంతేకాదు బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ప్రధాని బోరిస్‌.