
హిమాలయాలపై ఓ అద్భుతమైన చిత్రాన్ని నాసా షేర్ చేసింది. ఆకాశాన్ని అంటిన మెరుపుల దృష్యాన్ని విడుదల చేసింది. గైజాంటిక్ జెట్స్‌గా పిలిచే మెరుపుల్ని నాసాకు చెందిన ఆస్ట్రానమీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వద్ద ఉన్న హిమాలయాలపై పిడుగులు పడ్డాయి. 2018లో ఈ మెరుపులు ఒడిశాలోని భద్రక్‌లో కూడా కనిపించాయి. ఆ సమయంలో ఆ చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. నాలుగు భారీ మెరుపులు కొన్ని సెకన్లపాటు హిమాలయాలపై పడ్డాయి. భూమి, ఐయనోస్పియర్ మధ్య ఈ మెరుపులు సాధారణంగా కనిపిస్తుంటాయి.
సాధారణ మెరుపుల కన్నా.. గైజాంటిక్ జెట్స్ మెరుపులు 50 శాతం అధికంగా శక్తివంతమైనవి. భూమి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆ మెరుపు ప్రయాణించగలదు. గత ఏడాది ఆగస్టులో ప్యూర్టో రికో ఫోటోగ్రాఫర్ కి కూడా ఇలాంటి జెట్స్ చిక్కాయి. హురికేన్ ఫ్రాంక్లిన్ ను ఫోటోలు తీస్తున్న సమయంలో భారీ మెరుపులు అతనికి కెమెరాకు చిక్కాయి.