ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అసూస్ నుంచి జెన్ ఫోన్6 లాంచ్ అవనుంది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా.. ఫ్లిప్ కెమరా ఉంది. ఇది సెల్ఫీ తీసుకునేటప్పుడు వెనక ఉన్న కెమెరా ముందుకు తిరుగుతుంది. ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి 48 మెగా పిక్సెల్. రెండవది 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సెల్ఫీ దిగడానికి ఈ వైడ్ యాంగిల్ కెమెరాను ప్రత్యేకంగా రూపొందించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఫోస్ ధర 499యూరోలుగా ఉంది. భారత కరెన్సీ ప్రకారం రూ.39 వేలు. ఈ నెల 22వ తేదీన లాంచ్ కు డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ.. కంపెనీ మాత్రం అధికారికంగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయలేదు.
ఫీచర్స్:
బ్రాండ్: అసూస్
మోడల్: జెన్ ఫోన్ 6, 2019
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ వి 8.1(ఓరియో)
డిస్ప్లే 6.4 ఇంచులు
స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
64 GB స్టోరేజ్
4GB ర్యామ్
48 మెగాపిక్సెల్ కెమెరా
13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా
5000 MAH బ్యాటరీ + క్విక్ చార్జింగ్
