
అశ్విన్ బాబు హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి సహనిర్మాత. ఇప్పటికే టీజర్ విడుదల చేసిన మేకర్స్..
శుక్రవారం హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు అశ్విన్ బాబు. ఇటీవల క్లైమాక్స్‌కు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.
అశ్విన్‌కు జంటగా రియా సుమన్ నటిస్తోంది. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, వీటీవీ గణేష్, విద్యుల్లేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.