వాహనాల్లోనే  ఊపిరాడక మృతి

వాహనాల్లోనే  ఊపిరాడక మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని ముర్రేలో మంచు వర్షం ముంచెత్తడంతో 22మంది టూరిస్టులు చనిపోయారు. భారీగా మంచు కురవడంతో వాహనాల్లోనే ఇరుక్కుపోయి, ఊపిరాడక మృతిచెందారు. మరణించిన వాళ్లలో 9 మంది పిల్లలు సహా ఓ పోలీస్‌‌ ఆఫీసర్, ఆయన ఫ్యామిలీకి చెందిన 8 మంది ఉన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్‌‌ అధికారులు శనివారం వివరాలు వెల్లడించారు. ఇస్లామాబాద్‌‌కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రే.. వింటర్​ఫేమస్​పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఇది పాపులర్​హిల్​స్టేషన్. ఇక్కడ టెంపరేచర్స్​ మైనస్​డిగ్రీల్లో నమోదవుతాయి. రోడ్లన్నీ మంచుతో కప్పి ఉంటాయి. శుక్రవారం టెంపరేచర్​ మైనస్‌‌ 8 డిగ్రీలకు పడిపోయి భారీగా మంచు వర్షం కురిసింది. దీంతో వాహనాలన్నీ మంచులో చిక్కుకుపోయాయి. రాత్రంతా కురిసిన మంచు వర్షం వాహనాలను పూర్తిగా కప్పేసింది. దీంతో 22 మంది వాహనాల్లో ఊపిరాడక మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇస్లామాబాద్‌‌ పోలీస్ ఆఫీసర్​ అతిఖ్‌‌ అహ్మద్‌‌తో పాటు ఆయన 8 మంది కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ముర్రేలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పాక్‌‌ మీడియా సంస్థ పీటీవీ న్యూస్‌‌ వెల్లడించింది. మంచును తొలగిస్తున్న వీడియోను పాక్‌‌లోని పంజాబ్‌‌ ప్రభుత్వం ట్విటర్‌‌లో పోస్ట్‌‌ చేసింది.